అబ్బో..ఆ దేశంలో ప్రజలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్

-

కరోనా వ్యాక్సిన్ సమర్థవంతమని తేలితే అమెరికా ప్రజలకు ఉచితంగానే సరఫరా చేస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు. ప్రజా సంక్షేమం విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.అయితే టీకా సత్వర తయారీకి రెగ్యులేటరీ నిబంధనలను మేం సడలించడం లేదని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి పాల్ మ్యాంగో పేర్కొన్నారు. టీకాను తప్పక పరీక్షించి సామర్థ్యాన్ని అంచనా వేస్తామని తెలిపారు.టీకా ప్రాజెక్టులపై అమెరికా ఇప్పటికే 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. కోట్ల కొద్దీ డోసులు అందజేసేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. క్లినికల్ ట్రయల్స్​ తర్వాత వీటిని అందించేలా అంగీకారానికి వచ్చాయి.

Carona vaccine
Carona vacinne

వ్యాక్సిన్ డోసులకు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. వైద్యులు, క్లినిక్​ల ద్వారా అయ్యే ఖర్చులు సైతం బీమా పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అదనపు ఖర్చులను మాఫీ చేసేందుకూ వాణిజ్య బీమా సంస్థలు ముందుకొచ్చినట్లు మ్యాంగో తెలిపారు. 2021 జనవరి నాటికి వందలాది మిలియన్ల డోసులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news