ప్రతిపక్ష లీడర్లను కేసీఆర్ (KCR )ఆడుకున్నంత వేరెవరూ ఆడుకోలేరనే చెప్పాలి. ఆయన తన కామెడీ టైమింగ్ డైలాగులతో వారిపై ఘోరమై సెటైర్లు వేస్తుంటారు. కనీసం వారిని తాను ప్రత్యర్థేనా అనే రేంజ్లో తీసి పారేస్తారు. చాలా మంది పెద్ద లీడర్లను సైతం తన కామెడీ సెటర్లతో వారిని ప్రత్యర్థులుగా భావించట్లేదనే విషయాన్ని చెప్పకనే చెప్తారు గులాబీ బాస్.
మరి కొన్ని సార్లు అయితే ప్రత్యర్థుల పేర్లు చెప్పకుండానే వారిని కామెడీ పీస్‌లుగా వర్ణిస్తుంటారు కేసీఆర్. ఉదాహరణకు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్టుగా పవన్ పేరు చెప్పకుండా గింతంత సినిమా యాక్టర్ అని చెబుతుంటారు. అప్పట్లో అమిత్ షాను కూడా ఇలాగే అన్నారు. ఏం పేరు ఆయన పేరు అని చెప్పారు.
అయితే రేవంత్ విషయంలో మాత్రం కనీసం ఆయన ప్రస్తావన విలేకర్లు అడినప్పుడు కూడా సమాధానం చెప్పడానికి కేసీఆర్ కు ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన నేపథ్యంలో ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయాల్సి వస్తుంది. అయితే ఇందుకోసం రేవంత్ పేరు చెప్పకుండా ఓటుకు నోటు కేసును అస్త్రంగా మార్చుకుని ఆయనపై విమర్శలు చేసే అవకాశం ఉంది. అంటే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని అనే ఛాన్స్ కూడా ఉందన్నమాట.