తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారా అని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకుడు ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఈ ఎన్నిక ఇరు పార్టీలకు కీలకంగా మారింది. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు రాజకీయాలు నడుస్తున్నాయి.
ప్రస్తుతం ఈటల రాజేందర్‌ను ఢీ కొట్టేందుకు గులాబీ పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగా కదులుతోంది. ఇందుకోసం కేసీఆర్ మంత్రులు గంగులతోపాటుగా, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లాంటి వాళ్లను నియోజకవర్గంలో దింపారు.
అయితే ఈటల రాజేందర్ మాత్రం ఉద్యమనాయకులను నమ్ముకుంటున్నారు. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఉద్యమంలో వాడుకొని వదిలేసిన స్వామి గౌడ్, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలకు హుజూరాబాద్ ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నారు. అంతే కాదు టీఆర్ ఎస్ ప్లాన్ లను దెబ్బ కొట్టేందుకు వీరి ద్వారా వ్యూహాలను రచిస్తున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌కు ధీటుగానే ప్లాన్లు వేస్తున్నారని చెప్పాలి.