సినిమా కోసం వర్మకు దండేసి దండం పెట్టిన నిర్మాత..!!

రాంగోపాల్ వర్మ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఎందుకంటే తాను ఒక చిన్న ట్వీట్ తోనే అగ్గిరాజేసే రకం. దానిలో ఏమి లేకపోయినా అందులో ఏదో ఉన్నట్లు అందరిని ఆ చర్చలో పాల్గొనేల చేస్తాడు. మనోడు డోనాల్డ్ ట్రంప్ నుండి, గరిక పాటి దాకా ఎవ్వర్ని వదలకుండా టార్చర్ పెడుతూనే ఉంటాడు.

ఇక తాను, రీసెంట్ గా  తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. అసలే జరిగిందంటే.. తాజాగా రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ బర్త్ డే వేడుకలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వచ్చిన వారు రామ్ గోపాల్ వర్మని పెద్ద పూల మాలతో సత్కరించారు.  అసలే పూల దండలు, దేవుళ్ళు , బొట్లు వంటి ఫార్మాలిటీస్ కు దూరంగా ఉండే వర్మ దీనిపై కూడా విచిత్రంగా స్పందించాడు.

పుట్టిన రోజు జరుపుకుంటున్న మా వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కు వేయకుండా నాకు ఎందుకు దండ వేశారో అర్థం కావడం లేదు.అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు వర్మ. ఇక దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దాసరి కిరణ్ తో రాంగోపాల్ వర్మ  వ్యూహం అనే సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో మెయిన్ గా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీయాలని, సినిమాని కూడా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు విడుదలయ్యేలా రామ్ గోపాల్ వర్మ  ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.