బ్రేకింగ్ : ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 పెంపు.. ఈ నెల నుంచే అమలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాల వర్షం కురిపించారు. ఏపీ ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీని ప్రకటించడంతో పాటు…. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని కూడా పెంచేశారు. ఇప్పటి వరకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు ఉండగా దానిని 62 సంవత్సరాలకు పెంచారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

jagan
jagan

అలాగే పెరిగిన జీతాలను… జనవరి ఒకటో తేదీ నుంచే… అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్. 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు అవుతుందని… ఈ ఏడాది జూలై నుంచి రెగ్యులర్ పే స్కేలు అమలు అవుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల బకాయిలను ఏప్రిల్ నెలకల్లా క్లియర్ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే జూన్ 30 వ తేదీలోగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల సంఘం నాయకులు వెంకట రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news