హెచ్ ఐ వి కేసుల్లో ఈ రాష్ట్రమే నంబర్ వన్ !

-

దేశంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు.ఒకరి కంటేఎక్కువ మందితో శృంగారం చేసే విషయంలో చాలా మంది కండోమ్ లేకుండా ఈ కార్యంలో పాల్గొంటున్నారు.దీంతో హెచ్ఐవి అనేది కామన్ డిసీస్ గా మారిపోయింది.దేశవ్యాప్తంగా అరక్షిత లైంగిక సంపర్కం తో గత పదేళ్లలోగత పదేళ్ళలో 17.08 లక్షల మంది హెచ్ఐవీ బారిన పడినట్టు తాజాగా ఎయిడ్స్ నివారణ సంస్థ వెల్లడించింది.ఎయిడ్స్ కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఎయిడ్స్ నివారణ సంస్థ ఈ మేరకు బదులిచ్చింది.గడిచిన ఐదేళ్లలో అంటే 2011-21 మధ్య కాలంలో భారత్ లో 17 లక్షల 8 వేల 777 మందికి హెచ్ఐవి సోకినట్లు ఎయిడ్స్ నివారణ సంస్థ తెలిపింది.

అయితే దశాబ్దకాలంగా ఎయిడ్స్ బారిన పడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు సదరు సంస్థ వివరించింది.అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా 2011- 12 లో 2.4 లక్షల మందికి హెచ్ఐవి సోకగా 2020 – 21 లో ఆ సంఖ్య 85 వేల 268 గా ఉన్నట్లు తెలిపింది. గత పదేళ్ళలో రాష్ట్రాల వారీగా నమోదైన హెచ్ఐవి కేసులను పరిశీలిస్తే దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ గా కనిపిస్తుంది.గత పదేళ్లలో కాండోమ్ వాడకపోవడం వల్ల ఏపీలో 3,18,814 మందికి హెచ్ఐవి సోకింది.ఈ జాబితాలో ఏపీ తర్వాతి రాష్ట్రాల్లో మహారాష్ట్ర(2,84,577) కేసులు. కర్ణాటక(2,12,982) కేసులు.తమిళనాడు(1,16,53) కేసులు.ఉత్తర ప్రదేశ్( 1,10,911) కేసులు.గుజరాత్(87,440) కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news