దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు పై కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ ముగిసింది. సిర్పుర్కర్ కమిషన్ నిర్మించిన నివేదికపై ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. దిశ కేసును హైకోర్టుకు పంపాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను హైకోర్టు కు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పూర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశాలిచ్చింది.

supreme-court
supreme-court

తదుపరి విచారణను హైకోర్టు చేపడుతుందని, ఇరువురూ తమ వాదనను హైకోర్టు ముందే వినిపించాలని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ తీర్పునిచ్చారు.రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లి లో 2019 డిసెంబర్ 6న దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉండగానే ఎన్కౌంటర్ జరిగింది. కొంతమంది ఫిర్యాదు మేరకు సిర్పూర్ కమిషన్ మూడేళ్లపాటు విచారించింది. ఎన్ కౌంటర్ కు గురైన నిందితుల కుటుంబ సభ్యులు, ఈ కేసులో ఉన్న 18 మంది సాక్షులను, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారులు, అప్పటి కమీషనర్ సజ్జనార్, శంషాబాద్ డిసిపిగా ఉన్న ప్రకాష్ రెడ్డి,సిట్ అధికారి మహేష్ జాతీయ, జాతీయ మానవ హక్కుల సభ్యుల నివేదిక అన్ని అంశాలను నమోదు చేసుకొని రిపోర్టును తయారు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news