దేవుడి పేరుతో లాభాలు..ఏడాదికి 8 కోట్లు..

-

ఈరోజుల్లో ఏం చేసినా కూడా డబ్బులు కోసమే అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కాసుల కక్కుర్తి కోసం ఎంతకైన దిగజారుతున్నారు కొందరు..మరి కొంతమంది కొన్నిటిని వ్యాపారంగా మొదలు పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు.దేవుడి కోసం అనే పేరుతో మరింత లాభాలను గడిస్తున్నారు.డబ్బు అవసరం మనుషుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది.ఆ ప్రయత్నంలోనే కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.అవి చెప్పలేనంత విజయాన్ని తెచ్చిపెడతాయి. సామాన్యులను కూడా గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాంటిదే జరిగింది ఆ అక్కాచెల్లెల్లకు.

ఒకప్పుడు గుడికి వెళ్లాలనుకున్నప్పుడు వెంట కొన్ని పూలు తీసుకెళ్లే వారు. ఇంటి వెనక ఉన్న పూల చెట్ల నుండి దోసిట్లో పూలు కోసి లేదా రోడ్డు పక్కన ఉండే చెట్ల నుండి పూలు కోసి గుడికి వెళ్లేవారు. ఇంట్లో ఉన్న దేవునికి పూజ చేయాలన్న ఇలాగే ఉండేది.ఇప్పుడు పల్లెల్లో కూడా పూల మొక్కలను పెంచుకోవడానికి స్థలం లేక చాలా మంది పూలకు దూరం అయ్యారు.అవసరమే బెంగళూరుకు చెందిన యశోద కరుటూరి, రియా అక్కాచెల్లెల్లకు మంచి బిజినెస్ ను చూపించింది. ఉదయమే ఇంటికి పాల ప్యాకెట్ వస్తుంది. వార్తా పత్రిక కూడా తెల్లవారుజామునే ఇంటికి చేరుతుంది ఆన్ లైన్ ఆర్డర్ చేయగానే ఏదంటే అది మన ముంగిట వాలిపోతుంది. అలాగే పూలనూ ఆన్ లైన్ లో డెలివరీ చేయాలనుకున్న ఆ అక్కాచెల్లెల్లు. తాజా గులాబీలు, చామంతి, తామరపువ్వులు ఇంకా చాలా పూలు ఇంటికే డెలివరీ చేసే స్టార్టప్ ను ప్రారంభించారు.

హూవూ అనే పేరు పెట్టారు.10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన హూవూ ఇప్పుడు ఏటా రూ.8 కోట్ల టర్నోవరు సాధిస్తోంది. 2019 నుండి, అక్కాచెల్లెల్లు ఇద్దరూ పూల మార్కెట్‌కు సబ్‌స్క్రిప్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు..బొకే ల కోసం వింత పూలు మార్కెట్ లోకి వస్తున్నాయి.కానీ పూజ కోసం రాలేదని అనుకున్నారు.దాంతో ఈ బిజినెస్ లోకి దిగారు.హూవు అంటే కన్నడలో పువ్వులు అని అర్థం. హూవు ద్వారా తాజా పూలను అందిస్తున్నారు అక్కాచెల్లెల్లు. నాణ్యమైన ప్యాకింగ్ తో పూలను డెలివరీ చేస్తున్నారు. దీని వల్ల పూలు 15 రోజుల వరకూ ఏమాత్రం పాడవకుండా ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణే, ముంబై, గురుగ్రామ్ మరియు నోయిడా నుండి నెలకు 1,50,000 ఆర్డర్‌లను అందుకుంటున్నారు.ఇవే కాకుండా మరిన్ని ఉత్పత్తులను మార్కెట్ లో తీసుకొస్తామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news