అహోబిలం మఠం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రాష్ట్ర సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మసనం తోసిపిచ్చింది. మఠం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అహోబిలం మఠానికి ఈవో నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మసనం మఠం సాధారణ కార్యకలాపాలతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.