దెయ్యాలంటే అందరికి భయం ఉన్నా.. ఎందుకో వాటి గురించి తెలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా ఎక్కడలేని ఇంట్రస్ట్ ఉంటుంది. కొందరేమో దెయ్యాలున్నాయంటారు.. మరికొందరూ అంతా ట్రాష్ అంటారు. ఇలా ఉన్నాయో లేవో తెలియని వాటిమీద పుకార్లు, మరెన్నో రియాలిటీ కథనాలు వస్తుంటాయి. అయితే మలేషియాలోని ఓ 16ఏళ్ల కుర్రాడు.. హంటెడ్ భవనంలోకి వెళ్లి స్పాట్ లో చనిపోయాడు. అది దెయ్యాల భవనం అని స్థానికులు అంటుంటారు. ఈ భవనం ఏంటో.. ఆ కుర్రాడు ఎందుకు వెళ్లాడో.. అక్కడ ఏం చూసి చనిపోయాడో మనమూ చూద్దాం..!
పహంగ్ రాష్ట్రంలో బెంటాంగ్‌లో ఆ భవనం ఉంది. అక్కడకు డిసెంబర్ 1న తన ఫ్రెండ్‌కి చెందిన ఫ్యామిలీ సభ్యులతో ఆ కుర్రాడు వెళ్లాడు. అది చాలా పెద్ద భవనం. లోపల చీకటిగా ఉంటుంది. అప్పటిదాకా ఫ్యామిలీ సభ్యులతోనే తిరిగిన కుర్రాడు… కాసేపటికి వేర్వేరు గదుల్లోకి వెళ్లడం ప్రారంభించాడు. అది చీకటి సమయం కాకపోవడంతో ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.
కాసేపటి తర్వాత ఏదో పెద్ద శబ్దం వచ్చింది. అది వచ్చిన గదిలోకి వెళ్లి చూస్తే… ఆ కుర్రాడు నేలపై పడిపోయాడు.. అతన్ని కదిపితే కదల్లేదు. ఎలాంటి స్పందన లేదు. దాంతో… హడావుడిగా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని చెప్పడంతో వారంతా షాకై అయ్యారు.
దెయ్యాలే చంపేశాయా?
అసలే అది భూత్ బంగ్లా…అందులోను ఆ కుర్రాడు ఒంటరిగా వెళ్లి చనిపోయాడు. అందువల్ల స్థానికులు అతన్ని దెయ్యాలే చంపేశాయి అని పుకార్లు లేపారు. కానీ ఈ వాదనను డాక్టర్లలో నిపుణులైన వారు ఖండించారు. అతనికి వీక్ హార్ట్ ఉందని తెలిపారు. అలాంటి వాళ్లకు ఏ చిన్న భయం కలిగినా… గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఆ కోణంలో చూస్తే… అతను ఒంటరిగా భవనంలో తిరుగుతున్నప్పుడు ఏదో నీడనో, లేక బూజునో చూసి… దెయ్యం అనుకొని భయపడి ఉంటాడు. దాంతో హడలిపోయి.. హార్ట్ ఎటాక్‌తో చనిపోయి ఉండొచ్చు అని వైద్యులు చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా… ఇలా ఆ కుర్రాడు సడెన్‌గా చనిపోవడం… అందులోనూ ఆ హంటెడ్ హౌస్‌లో చనిపోవడంపై స్థానికంగానే కాదు… ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ కుర్రాణ్ని ఆ భవనం నుంచి బయటకు తీసుకొచ్చి… ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫుటేజ్ మలేసియా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అది మొత్తం 3 నిమిషాల వీడియో. ఆ ఫుటేజ్‌లో అతనిలో ఉలుకూ పరలుకూ లేదు. దాన్ని బట్టీ… అతను భవనంలోనే చనిపోయినట్లు కనిపిస్తోంది.
నిజంగానే ఆ కుర్రాడు దెయ్యాన్ని చూసే చనిపోయాడ లేక ఏదో నీడను చూసి దెయ్యం అనుకుని చనిపోయాడా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే..దెయ్యాల కథలేంటో ఎప్పుడూ ఇలాంటి డైలమాతో ఎండ్ అవుతాయి కదా. అందుకే అది సైన్స్ అని కొందరు అంటే..కాదు దెయ్యమని మరికొందరు అంటారు.