నేడే తెలంగాణా కేబినేట్… ఇవే హైలెట్

మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉండవచ్చు. వారం రోజుల తరువాత ఉదయం ఆన్ లాక్ ని అమలు చేసే యోచనలో సర్కార్ ఉంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నెల 12 వ తేదీ నుంచి లాక్ డౌన్ ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ తరువాత రాష్ట్రంలో తగ్గుతున్న పాజిటివ్ కేసులతో కాస్త ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. లాక్ డౌన్ పై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంటెలిజెన్స్ వర్గాల తో సీఎం ఆరా తీస్తున్నారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం ఈ ఎన్ టి, సరోజిని దేవి, గాంధీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1500 బెడ్స్ అందుబాటులో ఉంచాలని సిఎం ఆదేశించారు. వరంగల్ , నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్ కి చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్స్ బెడ్స్ ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.