మేకప్‌కు డబ్బులు ఇవ్వలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య..!!

-

బంధాలకు విలువనిచ్చే రోజులు కావివి.. అనుమానం పెనుభూతంగా ఉంది. అవసరాలకు సావాసాలు.. పెళ్లైతే ఆఖరి శ్వాస వరకూ వారితోనే అని పూర్వం రోజుల్లో వాళ్లు అనుకునే వాళ్లు.. కానీ ఈరోజుల్లో ఒకరికి ఒకరు సెట్‌ కాకపోతే..చాలా ఈజీగా విడిపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే గొడవలు పడుతున్నారు. కొన్నిసార్లు భర్తది తప్పు ఉంటే.. ఇంకొన్నిసార్లు.. భార్యది ఉంటుంది. మేకప్‌ చేయించుకోవాడనికి భర్తను డబ్బులు అడిగింది ఆ భార్య.. భర్త లేవనండతో ఆమె ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో..

ధిల్లీలో నివహిస్తున్న అమిత్ అనే ఓ వ్యక్తి ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల పాటు బానే ఉన్నారు.. సజావుగా సాగిన అమిత్‌ కాపురంలో కలహాలు రావడంతో భార్య, భర్తలు విడిపోయి జీవిస్తున్నారు. తన నుంచి విడిపోయి వేరే ఉంటున్న భార్య భర్త నుంచి తనకు భరణం ఇప్పించమంటూ ఆలీగఢ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా కోర్టులో సమర్పించిన పిటిషన్‌లో మేకప్‌ కోసం తన భర్త తనకు డబ్బులు ఇవ్వడం లేదని…ఇతర అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడని సాకులు చూపించింది.

2015లో వివాహం జరిగింది. నాలుగేళ్ల కాపురంలో భర్త ఆర్ధిక పరిస్థితిని చూసిన అమిత్‌ భార్య కేవలం తన ఆఢంబరాల కోసం భర్తతో విడిపోవడం…అటుపై భరణం ఇప్పించాలంటూ విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వివాహమైన మహిళ మేకప్‌ డబ్బులు ఇవ్వలేదనే కారణం చూపిస్తూ భర్త నుంచి శాశ్వతంగా విడిపోవాలని తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో పరువు, ప్రతిష్టలను పక్కన పెట్టి కేవలం మేకప్‌కి ఇచ్చిన ప్రాధాన్యత వైవాహిక జీవితానికి ఇవ్వకపోవడం ఏమిటని షాక్ అవుతున్నారు. ఈ విషయంలో ఆలీగడ్ ఫ్యామిలీ కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాలి..!!

ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు.. భర్తలు కూడా కొందరు ఇలానే ప్రవర్తిస్తున్నారు. అన్నంలో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు గీయించే సైకోలు ఉన్నారు. ఏది ఏమైనా.. ఒక మంచి పాట్నర్‌ దొరకడం అనేది అదృష్టమే..! కోట్లిచ్చిన కొనలేని ఆస్తి.. కాబట్టి.. చిన్న చిన్న కారణాలు సాకులుగా చూపి.. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోకండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version