The Raja Saab: రాజాసాబ్ టీజర్ వచ్చేస్తోంది.. ఇక ఒక్కొక్కడికి వణుకుపుట్టాల్సిందే

-

The Raja Saab: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో డార్లింగ్ ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్ మాళవిక మోహన్, మరో నటి నిధి అగర్వాల్, రిద్దికుమార్‌లు నటిస్తున్నారు.

The Raja Saab
TheRajaSaabTeaser Tomorrow at 10:52AM

అయితే తాజాగా…ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా టీజర్ కు ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 10:52 గంటలకు రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు అదిరిపోయే టీజర్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కనిపించలేదు కానీ… దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తోందని ఈ ప్రోమో లో చెప్పేశారు.

Read more RELATED
Recommended to you

Latest news