సానుభూతి రాజకీయాలు నడపడం కొడాలి నానికి రావు. రాకపోవడం కూడా ఒకందుకు మంచిదే ! ఆ దిశగా ఉన్నది ఉన్నట్లు ఉండదు కనికట్టు అన్న విధంగా సాక్షి సేపర్ స్లోగన్ కు దగ్గరగా ఆయన ఉంటారు. ఒకందుకు ఇది కూడా మంచిదే ! ముంచే మాటలు చెప్పడం కన్నా ఏం చేయాలో ఏం చేస్తామో ఏం చేస్తారో అన్నవి స్పష్టంగా వివరంగా చెప్పడం మంచిదే ! సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచుర్ తో నిన్నటి వేళ కాస్త హుందాతనంతో మాట్లాడారు తాజా మాజీ మంత్రి కొడాలి నాని.
రాజీనామా అనంతరం ఆయన ఒక్క మాట చెప్పారు అదే ఆశ్చర్యం.. సర్ మీరుంటారా అంటే నాకేం నాలుగు కొమ్ములు లేవని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఏదేమయినప్పటికీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రబాబును, చినబాబు అయిన లోకేశ్ ను అదే పనిగా తిట్టిపోసిన నాని ఇప్పుడేమయిపోతారో ?
తనకు క్యాబినెట్ హోదా వద్దని, క్యాబినెట్ లో స్థానం కూడా వద్దని జగన్ ఏం చెబితే అదే చేస్తానని నిన్నటి వేళ మీడియా ముఖంగా చెప్పారు. మంచిది ఈ పాటి మేలుకొలుపు మంచిదే ! ఎందుకంటే ఆయన భాష ఆయన సృష్టించిన వివాదాల కారణంగానే ఆయనకు పదవి నుంచి తప్పించాల్సి వచ్చిందని ఆఖరి నిమిషం లో కూడా జగన్ చెప్పలేకపోయారు. ఆయన చెప్పకున్నా రేపటి వేళ ప్రజలు చెప్పేదిదే కావొచ్చు. ఒకవేళ ఆయన మళ్లీ గెలిచి, మళ్లీ మంత్రి పదవి కొట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎందుకంటే గుడివాడ నా అడ్డా అని పదే పదే చెప్పి టీడీపీ నాయకులను రాళ్లతో సన్మానించిన చరిత్ర ఒకటి ఆయనకు ఉంది అని విపక్షం నెత్తీ నోరూ కొట్టుకుని చెబుతోంది. కనుక ఇప్పుడు ఆయనంటే ఇంకాస్త భయం పెంచుకోవాలి అని కూడా అంటోంది. ఎందుకంటే పదవి ఉంటే కాదు లేకపోతే విశ్వరూపం చూపిస్తానని గతంలోనే చెప్పారు. అదే మాట నిన్నటి వేళ మీడియా మైకుల ముందు కాస్త గట్టిగానే చెప్పారు. అంటే ఫైట్ కు ఆయన సిద్ధమే ! జగన్ ఆపినంత వరకూ చంద్రబాబును తిట్టడం ఖాయం. కానీ జగన్ ఆపరు కదా! కనుక నాని కి అడ్డే లేదు. అడ్డగోలుగా మాట్లాడడం ఇవాళ రాజకీయాల్లో ఫ్యాషన్.ఆ విధంగా నాని పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటికీ అలానే ఉంటారు. నేనే నానినే అని అంటూ ఉంటారు. దటీజ్ నాని దటీజ్ గుడివాడ నాని..ద ప్రైడ్ ఆఫ్ జగన్..ఎఫ్రైడ్ ఆఫ్ టీడీపీ ఆల్సో !