ఆ సంస్థలో భారీగా ఉద్యోగాలు..ఇలా అప్లై చేసుకోండి..

-

భారత ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది..ఇప్పటికే ఎన్నో సంస్థలలో ఉద్యోగాలను విడుదల చేశారు.ఇప్పుడు మరో సంస్థలో ఉద్యోగాల భర్థికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 3 కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది..

ఆఫ్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానించారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 9 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆరు నెలల పాటు భర్తీ చేస్తోంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా పోస్ట్ పొడిగించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సంస్థ పేరు: సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB)

పోస్టుల సంఖ్య: 3

ఉద్యోగం స్థానం: బెంగళూరు

పోస్ట్ పేరు: కన్సల్టెంట్

పోస్టు పేరుపోస్టుల సంఖ్యవయో పరిమితికన్సల్టెంట్ (Law & Labour)164కన్సల్టెంట్ (Technical Division)కన్సల్టెంట్ (Establishment Section

అర్హతలు:

ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసి.. ఇండియన్ లా సర్వీసెస్ నుండి రిటైర్డ్ అయిన అధికారులు అర్హులు. వీటికి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. రిటైర్డ్ పర్సన్స్ ను దీనికి అర్హులుగా పేర్కొన్నారు. ఇతర వివరాలకు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు..

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 19 జూలై 2022
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 09 ఆగస్టు 2022

దరఖాస్తు సమర్పణ ప్రక్రియ..

2022 నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి.. అభ్యర్థి అర్హత ప్రమాణాలకు తగిన విధంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.

కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం సరైన ఈ మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ , వయస్సు, విద్యార్హత, ఇటీవలి ఫోటోగ్రాఫ్, రెజ్యూమ్, అనుభవం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. వాటి జిరాక్స్ కాపీలను తీసుకోవాలి.

అధికారిక నోటిఫికేషన్ నుండి అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ ను ప్రింట్ తీసుకొని వివరాలను నింపాలి.
మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత.. అందించిన వివరాలు సరైనవో కాదో చూసుకొని.. స్పీడ్ లేదా రిజిస్టర్‌ పోస్టు ద్వారా సెక్రటరీ, సెంట్రల్ సిల్క్ బోర్డ్, BTM లేఅవుట్, మడివాలా, హోసూర్ రోడ్, బెంగళూరు – 560068, కర్ణాటక చిరునామాకు పంపించాలి.

Read more RELATED
Recommended to you

Latest news