తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, “చర్చల్లో టాపిక్”!

-

తెలంగాణాలో నవంబర్ 30న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పార్టీలు గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చుకుని విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరు కానున్నారు అన్న అంశం చర్చల్లో ఉంది, కాగా ఈ రోజు తాండూరు ప్రచార కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ వచ్చి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈయన మాట్లాడిన మాటలకు తెలుగులో ట్రాన్సలేషన్ చేస్తున్న రామ్మోహన్ రెడ్డి… డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చిన తొమ్మిది హామీలపై సంతకాలు పెడుతుందని చెప్పడానికి బదులుగా, సోనియాగాంధి పుట్టినరోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవడమే కాకుండా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ అనేశాడు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version