రాజన్న సిరిసిల్ల జిల్లా: నియోజకవర్గ స్థాయి ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభకి హాజరయ్యారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లని దేశంలోనే టాప్ లో నిలిపామన్నారు. తనకి 89 వేల మెజారిటీ ఇచ్చారు కానీ.. ఎంపీగా మత చిచ్చుపెట్టేటోళ్లను గెలిపించారని అన్నారు. మంచి మనిషి వినోద్ కుమార్ ను ఓడగొట్టి విచిత్రమైన మనిషిని గెలిపించుకున్నారని అన్నారు కేటీఆర్.
కానీ ఈసారి అలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహారాష్ట్రలో రైతులు కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు కేటీఆర్. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిలను తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారని హెచ్చరించారు. కెసిఆర్ కాలిగోటికి సరిపోయే నాయకుడు ఎవరూ లేరని అన్నారు కేటీఆర్. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలవారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వలన అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.