ఈ ఏడాది కృష్ణంరాజు తో సహా మరణించించిన సినీ ప్రముఖులు వీళ్లే..!

-

ప్రముఖ రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఏ ఐ జి హాస్పిటల్ లో మృతి చెంది సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈయనతో పాటు 2022లో సినీ ఇండస్ట్రీలో కన్ను మూసిన ప్రముఖుల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

తాతినేని రామారావు:

తెలుగుతోపాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20వ తేదీన తుది శ్వాస విడిచారు.

బాలయ్య:

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య ఏప్రిల్ 9న కన్నుమూశారు . ఇక ఈయన నటుడిగా 300 కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ఇకపోతే ఎత్తుకు పై ఎత్తు అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన ఈయన కథా రచయితగా , నిర్మాతగా , దర్శకుడిగా తన ప్రతిభ ను కనబరిచారు. ఇక ఆయన నిర్మాతగా అమృత ఫిలిమ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం, నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త , ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలను నిర్మించడం జరిగింది.

దర్శకుడు శరత్:
ఏప్రిల్ ఒకటిన సీనియర్ దర్శకుడు శరత్ కన్ను మూయడం జరిగింది. కృష్ణ హీరోగా వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆ తర్వాత ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వ శాఖలో అసోసియేట్ గా పనిచేశారు. సుమన్ హీరోగా వచ్చిన చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకుడిగా మారారు.

కందికొండ యాదగిరి:

తెలంగాణ యాస, భాష, సంస్కృతిని ప్రజలకు చేరువచేసిన కందికొండ యాదగిరి మార్చి 12వ తేదీన కన్ను మోసారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వరరావు:
మార్చి 12న అనారోగ్యంతో కన్నుమూశారు.

ప్రదీప్ కొట్టాయం:


మలయాళీ నటుడు కొట్టాయం గుండెపోటుతో ఫిబ్రవరి 17వ తేదీన కన్నుమూశారు . 70 కి పైగా సినిమాలలో నటించి ఆ తర్వాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఏ మాయ చేసావే , రాజా రాణి వంటి సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులుగా మారారు.

వీరితోపాటు ప్రముఖ సీనియర్ నటి కెపిఏసి లలిత, బప్పి లహరి, సంధ్య ముఖర్జీ, దీప్ సిద్దు , ప్రవీణ్ కుమార్ సోబ్తీ, రవీనా టాండన్, లతా మంగేష్కర్ , కొంచాడ శ్రీనివాస్, పండిట్ బ్రిడ్జి మహారాజ్, రమేష్ బాబు, పి చంద్రశేఖర్ రెడ్డి తదితర ప్రముఖులు ఇదే ఏడాది కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version