వేసవిలో హైదరాబాద్ లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఇవే.. మరి చూసొచ్చేయండి..!

-

వేసవి సెలవుల్లో ఏదైనా చోటికి వెళ్లి సరదాగా కుటుంబంతో గడపాలని ఉంటుంది. అయితే ఎక్కువ దూరం కూడా మనం వెళ్లక్కర్లేదు. హైదరాబాద్లోనే చాలా ప్రదేశాలు వేసవిలో చూడటానికి చాలా బాగుంటాయి. కాబట్టి మీ పిల్లలకు వేసవి సెలవులు వచ్చినప్పుడు మీరు కూడా కాస్త వీలు కల్పించుకుని ఈ ప్రదేశాలు అన్నిటినీ చుట్టేసి వచ్చేయండి. అయితే మరి ఈ వేసవి కాలం లో హైదరాబాద్ లో చూడాల్సిన ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

స్నో వరల్డ్:

స్నో వరల్డ్ అనేది ఎమ్యూజ్మెంట్ పార్క్. ఇది మన హైదరాబాద్ లోనే ఉంది. స్నో వరల్డ్ కి కుటుంబ సమేతంగా వెళ్లి వేసవి లో బాగా ఎంజాయ్ చేయొచ్చు.

హుస్సేన్ సాగర్ లేక్:

హుస్సేన్ సాగర్ కి కూడా మీరు వేసవి కాలంలో వెళితే బాగుంటుంది. బుద్ధుడి విగ్రహం అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. వాటర్ స్పోర్ట్స్ బోర్డ్ ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇలా ఎంతో సరదాగా గడపచ్చు.

నాగార్జునసాగర్ డ్యాం:

నాగార్జునసాగర్ డ్యాం కూడా చూడొచ్చు వేసవికాలంలో హైదరాబాదులో నాగార్జున సాగర్ ని కూడా చూడడం బాగుంటుంది. కనుక హైదరాబాద్ వెళితే దీనిని కూడా మిస్ కాకుండా చూసేయండి.

రామోజీ ఫిలిం సిటీ:

లైటింగ్ తో రామోజీ ఫిలిం సిటీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫిలిం సెట్స్ తో రామోజీ ఫిలిం సిటీ కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడికి కూడా సరదాగా వెళ్లి సమయాన్ని గడపచ్చు.

అనంతగిరి హిల్స్:

అనంతగిరి హిల్స్ చాలా పురాతనమైనవి. పైగా ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ ఆలయాలు మొదలైన ప్రాంతాలను మీరు చూసేయొచ్చు. ఇది కూడా కుటుంబ సమేతంగా చూడడానికి బాగుంటుంది.

అలానే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, కుంతలా వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. హార్స్లీ హిల్స్, కొల్లేరు లేక్ బర్డ్స్ సెంచరీ, నెహ్రూ జూలాజికల్ పార్క్ కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు. వేసవిలో కుటుంబ సమేతంగా ఈ ప్రదేశాలన్నీ చూసి ఎంతో ఎంజాయ్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news