నేనంటే భయం అందుకే.. ము**డా అని తిడుతున్నారు : లోకేష్

-

అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో, మండలిలో కూడా నన్నే తిడుతున్నారని.. అసెంబ్లీలో నా తల్లిని దూషించారు.. ఇప్పుడు నన్ను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు.. అందుకే నన్ను ముండా అని తిడుతున్నారేమో..? అని చురకలు అంటించారు.

అయినా ప్రజల కోసం తిట్లన్నింటినీ భరిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో నా తల్లిని దూషించారు.. ఇప్పుడు నన్ను తిడుతున్నారని ఫైర్ అయ్యారు. నా తల్లిని దూషించిన ప్పుడు.. నన్ను దూషించినప్పుడు సీఎం స్పీకర్ నవ్వుకున్నారని నిప్పులు చెరిగారు నారా లోకేష్.

నేనేదీ మర్చిపోలేదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటానని వెల్లడించారు. డెప్యూటీ సీఎం నారాయణ స్వామి క్షమాపణ చెప్పలేదని చెప్పారు. సభలో డెప్యూటీ సీఎం అలాంటి పదాలు వాడవచ్చా..? అని పేర్కొన్నారు. సభలో లేని సభ్యులు గురించి నిబంధన ప్రకారం మాట్లాడకూడదని నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news