మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెన్షన్ పెంపు పై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
నెలవారి పెన్షన్ ను రూ. 2,500 నుంచి రూ. 2,750 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త పెన్షన్ విధానం అమలు కానుంది. ఈ నిర్ణయం ద్వారా 62.31 లక్షల మందికి లబ్ధి కలగనుంది. దశలవారీగా పెన్షన్ పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో వైసీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు వైయస్సార్ పశు భీమా పథకం ప్రతిపాదనకు జేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీ, హెల్త్ అప్స్ ఏర్పాటు కోసం కొత్త విధానం రూపకల్పన, భూముల రీ సర్వే కోసం మునిసిపాలిటీల చట్ట సవరణ. ఏపీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి ఆమోదం. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి పలు కీలక నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.