టాలీవుడ్​లో రాబోయే సీక్వెల్స్ మూవీస్ ఇవే!

-

టాలీవుడ్​లో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా వరుస సీక్వెల్స్​ రాబోతున్నాయి ఏకంగా డజను సినిమాలకు సీక్వెల్స్​ ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​ ఈ సీక్వెల్స్ లైన్ అప్ చూస్తే వావ్ అంటారు ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్​ కూడా స్టార్ట్​ అయ్యింది మరి ఆ సినిమాలేవి అందులో మీకు ఏది ఇష్టమో చూడండి

రవితేజ హీరోగా వచ్చిన రామారావు మూవీకి సీక్వెల్ ఉందని వేశారు అయితే ఫస్ట్​ మూవీనే సరిగా ఆడలేదు మరి సీక్వెల్​ ఎలా ప్లాన్​ చేశారనేది అర్థం కాకుండా ఉంది ఫైనల్​గా వస్తుందో లేదో చూడాలి.

మంచు విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ ఢీ ఈ సినిమాకు సీక్వెల్ త్వరలో రాబోతోంది కెరీర్​ పరంగా డీప్​ ట్రబుల్​లో ఉన్న శ్రీనువైట్లకు విష్ణుకు అర్జెంటుగా ఓ హిట్టుకావాల్సిన టైమ్​ ఇది మరి డబుల్​ డోస్​ అంటూ రాబోతున్న ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


అడివి శేషు ప్రధాన పాత్రలో వచ్చిన గూఢచారి సైలెంట్ హిట్ కొట్టింది ఈ మూవీకి సీక్వెల్​ రాబోతోంది. అడివి శేషు హీరోగా 2020లో వచ్చిన హిట్​ మూవీకి సీక్వెల్​గా హిట్​ ది సెకండ్​ కేస్​ తీస్తున్నారు.

ఇప్పటికే సీక్వెల్​తో బాక్సాఫీస్​ను షేక్​ చేసిన మూవీ కేజీఎఫ్ ఈ చిత్రానికి పార్ట్​3 కూడా ఉందని సెకండ్​ పార్ట్​ ఎండింగ్​లో కన్ఫాం చేశారు అయితే దీనికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది.

మణిరత్నం లేటెస్ట్​ హిట్​ పొన్నియన్ సెల్వన్​ మూవీని రెండు భాగాలుగా తీస్తున్నట్టు ముందే ప్రకటించారు సెకండ్ పార్ట్​ వచ్చే ఏడాది రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కార్తి సర్దార్ మూవీకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


కోలీవుడ్ స్టార్​ కార్తి హీరోగా నటించిన ఖైదీ మూవీ సూపర్ హిట్​ కొట్టింది ఈ మూవీకి సీక్వెల్​ రాబోతోంది త్వరలోనే షూటింగ్​ స్టార్ట్​ కానుంది.

టాలీవుడ్​ కామెడీ బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీకి సీక్వెల్ ఉంది ఈసారి ఈ జాతిరత్నాలు అమెరికా షిఫ్ట్ అవుతారని టాక్ మరి కామెడీ ఏ రేంజ్​లో ఉంటుందో చూడాలి.

తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఈ మూవీకి సీక్వెల్​ వస్తున్న సంగతి తెలిసిందే పుష్ప ది రూల్​ అంటూ రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్​ ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు.

కార్తికేయ చిత్రానికి సీక్వెల్​గా వచ్చిన కార్తికేయ2 బాక్సాఫీస్​ వద్ద సూపర్ హిట్​ అయ్యింది పార్ట్​3 రాబోతోందని క్లైమాక్స్​లోనే కన్ఫాం చేశారు ఈసారి త్రీడిలో తీయబోతున్నారని టాక్.

అట్లుంటది మనతోని అంటూ డీజే టిల్లు చేసిన సందడి ఓ రేంజ్​లో సాగింది ఈ మూవీకి సీక్వెల్​ రాబోతోంది పార్ట్​2లో ఇంకెంత హంగామా చేస్తాడో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news