దేశంలో మద్యానికి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.వయస్సు మీద పడిన వాళ్ళు అంటే చేసిన పనిని మర్చి పోవడం కోసం తాగుతున్నారు అనుకోవచ్చు.కానీ యువకులు కూడా అది పడితేనే బాగుంటుంది..అంటూ మద్యం తాగి రెచ్చిపోతున్నారు. ఆ మత్తులో వాళ్ళు చేస్తున్న పనులు జనాలకు కోపాన్ని తెప్పించిన ఘటనలు కూడా లేకపోలేదు.
ఇది చాలదన్నట్టు తామేదో ఘనకార్యం చేసినట్టు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. తాజాగా వీరి వికృత చేష్టలకు పరాకాష్టగా నిలిచే మరో ఘటన చండీగడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు ఫుల్‌గా మద్యం సేవించి హిందువుల ఆరాధ్య దేవుడు అయిన పరమశివుని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా దీనిపై హిందువులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
ఈ వీడియోలో ఇద్దరు యువకులు బాగా మద్యం సేవించి శివలింగానికి బీర్ తో అభిషేకం చేయడం మీరు గమనించవచ్చు. ఈ వీడియో లో ఇద్దరు ఆకతాయిలు బూట్లు ధరించి పవిత్రంగా భావించే శివలింగం వద్దకు రావడం చూడొచ్చు. అనంతరం వీరు తమ చేతిలో ఉన్న బీర్ బాటిల్స్ లోని మద్యాన్ని శివలింగంపై పోయడం చూడవచ్చు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బజరంగ్ దళ్ పార్టీ కార్యకర్తల వీరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఈ యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక యువకుడు చండీఘడ్ రాష్ట్రంలోని ఐటీ పార్కు సెక్టార్ 26కు చెందినవాడిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా కొలిచే నీలకంఠుడి పట్ల యువకులు వ్యవహరించిన తీరుపై పలు హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు ఎంతగానో దెబ్బ తీసిన ఈ యువకులపై కఠిన చర్యలు తీసుకొకపోతే ఆందోళనలు తారాస్థాయికి చేరుతాయని హిందువులు ప్రభుత్వానికి హెచ్చరిస్తూన్నారు..ఈ ఘటన ఎన్ని గొడవలకు దారి తీస్తుందో చూడాలి..
Video of Two Youths Anointing Shivling with Beer Goes Viral; #BajrangDal Demands Strict Action
Read here: https://t.co/NILt82jYdG pic.twitter.com/4eWYJs0w8z
— News18.com (@news18dotcom) June 24, 2022