ఎడిట్ నోట్: సెకండ్ బెర్త్ ఎవరికి?

-

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి సులువుగా అధికారంలోకి రావడం కష్టం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో గట్టి పోటీ ఎదుర్కోవాలి..అదే సమయంలో మిగిలిన విపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో బి‌జే‌పికి కాస్త రిస్క్ ఉంది. ఈ పరిణామల నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపుపై బి‌జే‌పి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, అమిత్ షా, జే‌పి నడ్డా, బి‌ఎల్ సంతోష్..పార్టీ పరిస్తితులపై చర్చలు చేస్తున్నారు.

అలాగే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటగలిగితేనే..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెరుగు పడతాయి. దీంతో బి‌జే‌పి అధిష్టానం మొదట ఈ రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ లో మార్పులు చేయడానికి రెడీ అయింది. కొందరిని మంత్రి వర్గం నుంచి తప్పించి..ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి బి‌జే‌పి ఎంపీలని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాల అధ్యక్షులని సైతం మార్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఒకరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ బెర్త్ కూడా ఇవ్వాలని చూస్తున్నారు.

అయితే రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని, ఆయన స్థానంలో వేరే నేతని అధ్యక్షుడుగా పెడతారని అంటున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని సమాచారం..బండిని అధ్యక్షుడుగానే కొనసాగించనున్నారు. ఇప్పటికే బి‌జే‌పి అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. ఇక మిగిలిన ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, కె.లక్ష్మణ్‌ల్లో ఒకరిని కేబినెట్ లోకి ఖచ్చితంగా తీసుకుంటారని తెలుస్తుంది. తెలంగాణలో మరింత బలం పెంచుకోవడం కోసమే..మరొకరికి కేబినెట్ లో ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి సెకండ్ బెర్త్ ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news