ఈ వస్తువులు పొరపాటున కూడా కింద పడకూడదు..కష్టాలు తప్పవు..

-

భారతదేశం సాంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీక రోజులు మారిన కొందరు ఆచారాలను మర్చిపోరు..అలాంటి సంప్రదాయాలలో కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు..ఆ వస్తువులు కింద పడితే అశుభంగా భావిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎప్పుడైనా బయటకి వెళ్లే సందర్భంలో మన చేతిలోని వస్తువులను పొరపాటున క్రింద పడేస్తూ ఉంటాము. ఇది అశుభానికి సంకేతం అని పండితులు చెబుతున్నారు. పవిత్రంగా భావించి వస్తువులను అసలు అలా పొరపాటున కూడా కింద పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు..చేతిలోని వస్తువులు జారితే పనిలో క్షీణత, వైఫల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు.దీని వల్ల వస్తువులను ఎప్పుడు కూడా క్రింద పడనివ్వకుండా చూసుకోవడం మంచిది. వంట గదిలో లేదా డైనింగ్ టేబుల్ పై ఉండే ఉప్పు మన చేతుల్లో నుంచి కింద పడితే శుక్రుడు, చంద్రుడు బలహీనతకు సంకేతం అని చెబుతున్నారు. ఇలా జరిగితే దంపతుల జీవితంలో గొడవలు, చికాకులు వస్తాయని చెబుతున్నారు..

వైవాహిక జీవిత సమస్యలతో సతమతమవుతూ ఉంటారని చాలా మంది నమ్ముతారు. మన చేతి నుంచి నూనె కింద పడిపోతే ఏదో పెద్ద సమస్య వచ్చే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. అంతే కాకుండా అప్పులు పెరిగి రుణ సమస్యలను ఎదుర్కొంటారు. హారతి పళ్లెం మన చేతి నుంచి కింద పడితే, ఉపవాసం పూజల పట్ల మనకు పుణ్యఫలం లభించాదని పండితులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద సమస్య రాబోతుందని సంకేతం.. అదే విధంగా భోజనం ప్లేటు కిందపడితే అతిధులు వస్తారని సమాచారం..పాలు కింద పడితే కూడా అ శుభమని చెబుతున్నారు. అందుకే ఈ వస్తువులను కింద పడకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news