అక్కడ దెయ్యాలకు భోజనాన్ని పెడతారట..ఎందుకంటే?

-

అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయి అనే చెప్పే ఎన్నో ఉన్నాయి.చాలామంది దెయ్యాలను నమ్మరు. కొందరు నమ్ముతారు. అయితే ప్రపంచంలో దెయ్యాలకు ఆహారం తినిపించే ఒక దేశం కూడా ఉందనే సంగతి చాలా మందికి తెలియదు.. అవును, మీరు విన్నది అక్షరాల నిజం.. అక్కడ ఈ ప్రక్రియ 15 రోజులు కొనకొనసాగుతుంది. దీని వెనుక గల ప్రత్యేక కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ దెయ్యాలకు ఆహారం పెట్టకపోతే దుష్టశక్తులు, ప్రేతాత్మలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతాయని చెబుతుంటారు. ఇది ఎంత నిజమో, ఎంత అబద్ధమో ఎవరూ చెప్పలేక పోయినప్పటికీ స్థానికులు దీని వెనుక ఒక నమ్మకాన్ని ఏర్పరుచుకున్నారు..

ఆసియా దేశమైన కంబోడియాలో ఈ ప్రాంతం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, అక్టోబర్ మధ్య ఈ పండుగను 15 రోజుల పాటు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా 15 రోజుల పాటు నరకం తలుపులు తెరుస్తారని కంబోడియాలో నమ్మకం. ఈ ద్వారాలు తెరిచాక దుష్ట ఆత్మలు, దయ్యాలు బయటకు వస్తాయని, అవి ఆకలితో ఉంటాయని చెబుతారు. వాటిని శాంతింపజేసేందుకు వాటికి ఆహారం అందజేస్తారు. ఈ పండుగలో నాలుగు రకాల దయ్యాలు, ఆత్మలు తిరుగాడుతుంటాయంటారు. ఈ ఉత్సవాన్ని ఖైమర్ పండుగ అని అంటారు. ఈ పండుగ రోజుల్లో దెయ్యాలు దేవాలయాలు, స్మశానవాటికలు, వారి బంధువుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ మంచి ఆహారం కోసం ఎదురు చూస్తాయని చెబుతారు. మంచి ఆహారం లభించకపోతే మనుషులను ఇబ్బంది పెడతాయట. కంబోడియాలోని ప్రజలు నమ్ముతారు..

తమ ఏడుగురు పూర్వీకులకు ఆహారం అందజేస్తారు. పండుగ మొదటి రోజు సూర్యోదయానికి ముందే ఆహారాన్ని సిద్ధం చేస్తారు. దెయ్యాలు కాంతిని ఇష్టపడవనే భావనతో ఉదయాన్నే వాటికి ఆహారాన్ని అందిస్తారు. చిన్నపాటి సూర్యకాంతి కనిపించినా అవి ఆహారం అంగీకరించవని చెబుతారు. దెయ్యాలకు ఆహారం పెట్టనివారు నరకానికి వెళతారని స్థానికులు భావిస్తారు. నరకంలోనివారికి దుస్తులు, ఆహారం లభించవని స్థానికులు చెబుతారు. ఉత్సవ సమయంలో బంధువుల ఆత్మలకు ఆహారం అందజేస్తే ఎటువంటి బాధలు ఉండవని వాళ్ళ విశ్వాసం..అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు..

Read more RELATED
Recommended to you

Latest news