వాళ్లని తరిమి కొట్టాలి – సీఎం కేసీఆర్

-

బుధవారం మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట్ మండలం హతాయిపల్లిలోమండలం హతాయిపల్లిలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా ఏర్పాటు, పరిపాలన భవనం ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరు ఊహించలేదని.. తెలంగాణ వచ్చాక మనం మేడ్చల్ జిల్లా సాకారం చేసుకున్నామని అన్నారు.

మూడు జిల్లాలు చాలు అనుకోని ప్రజాప్రతినిధులు చెప్పారని.. అందుకే మేడ్చల్ జిల్లా అయ్యిందన్నారు. “రైతు వేదికలు, ఏఈఓలను నియమించాం. పరిపాలన వికేంద్రీకరణ జరిగింది కాబట్టే ఇన్ని భవనాలు ఏర్పాటు చేసాం. మనం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు లబాసాటిగా మారాయి, అందుతున్నాయి. 57 ఏళ్ల వారికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో కరెంట్ ఎక్కడ ఉండేది కాదు, కానీ ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుంది. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒకటే అది తెలంగాణే.

దేశంలో 75 ఏళ్ల నుండి అసమర్థ పాలన వల్ల కరెంట్ సమస్య ఏర్పడింది. ఢిల్లీలో 24 గంటల కరెంట్ రాదు. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులను పెంచి మేడ్చల్ జిల్లా పరిధిలో నిధులు కేటాయిస్తాం. ఇప్పుడున్న 5కోట్లకు అదనంగా మరో 10 కోట్లు ఎమ్మెల్యే ఫండ్ కింద ఇచ్చి రేపే జీవో విడుదల చేస్తాం. తెలంగాణ తలసరి ఆదాయంలో ఇండియాలోనే నంబర్ 1గా ఎదిగింది. కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం కింద 11 లక్షల మందికి లబ్ది జరిగింది. ఆసరా పెన్షన్ నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తున్నాడని గర్వాంగ చెబుతున్నారు.

కరోనా రాకుంటే 500 రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించుకునే వాళ్ళం. 12 రాష్ట్రాల నుండి కార్మికులు తెలంగాణకు వచ్చి పని చేసుకుంటున్నారు. 60 ఏళ్ల కింద తెలంగాణ నిద్ర పోయి ఉండే. పోరాడి తెచ్చుకున్నాం మన తెలంగాణ. దేశంలో జరిగే రాజకీయాలపై గ్రామాల్లో పట్టణాల్లో చర్చ జరగాలి. టీవీల్లో, పేపర్ లో చదవటం కాదు నలుగురు కలిసి చర్చించుకోవాలి.
దేశాన్ని మతం, కులం పేరు మీద చీల్చే కుట్ర జరుగుతోంది. దేశంలో కులం మతంలని ఐక్యత మనలో రావాలి. చైనా, సింగపూర్,కొరియా లాంటి దేశాల్లాగా మన దేశం ఎదగాలి.

దేశం అభివృద్ధి జరగాలంటే దేశంలో గుణాత్మక మార్పు రావాలి. ఢిల్లీ లో మంచి నీళ్ళు కొనే పరిస్థితి ఉంది. నీచ రాజకీయాలు, దుర్మార్గులు దేశాన్ని విచ్చినం చేయాలని చూస్తున్నారు. దీనిపై మీరంతా చర్చించాలి, వాళ్ళని తరిమికొట్టాలి. ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, అది మనకు మంచిది కాదు. ఏమరుపాటుగా ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది. మేడ్చల్ జిల్లాకి ప్రకటించిన 70 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం” అని అన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news