మామిడి లో పూత సమయానికి రావాలంటే ఇలా చెయ్యాలి..!!

-

మన దేశంలో మామిడిని ఎక్కువగా పండిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, సాగులో పాటించే యాజమాన్య పద్ధతులను బట్టి నవంబరు నుంచి జనవరిదాకా పూమొగ్గలు వస్తాయి.ఇకపోతే వర్షాకాలం మొదటి నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే బెట్ట పరిస్థితుల వల్ల వర్షాధారంగా పెంచే తోటల్లో ముందుస్తుగానే పూత వస్తుంటుంది..

 

మామిడిలో త్వరగా రావాలంటే..

వాతావరణం మారినప్పుడు చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆలస్యంగా కనిపి స్తాయి. అలాంటి పరిస్థితుల్లో పూమొగ్గలను ఉత్తేజపరిచి తొందరగా పూత తెప్పించటానికి డిసెంబరు 15-20 తేదీల మధ్య నీటి వసతి ఉన్న తోటల్లో మామిడి పాదుల్లో ఒక తేలికపాటి తడినివ్వాలి. లీటరు నీటికి 10గ్రా. పొటా షియం నైట్రేట్+5గ్రా. యూరియాతో కలిపి పిచికారి చేయాలి ఇలా చేస్తే త్వరగా పూమొగ్గలు దాదాపు ఒకేసారి చిగురిస్తాయి.

ఇక యూరియాను నీటిలో కలిపి పిచికారి చేయడం వల్ల మొక్కలు తొందరగా పీల్చుకోవడమేగాక తక్కువ సమయంలో ఆకులు ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం నైట్రేట్లోని పొటా షియం ఆహారం తయారైన ప్రదేశం నుంచి అంటే ఆకుల నుంచి ఆహార నిల్వ ఉంచే ప్రదేశమైన పూలమొగ్గల దగ్గరకు చేరవేసేందుకు ఉపయోగపడు తుంది. అంతే గాకుండా పూత రావటానికి ఉత్తేజం కలుగుజేస్తుంది.

పొటాషియం నైట్రేట్ ద్రావణం పిచికారి చేయకపోతే వేర్ల ద్వారా భూమి నుంచి పోషకాలు గ్రహించి వాటిని ఆకులను చేరవేసి అక్కడ ఆహార పదార్థాలు తయారవటానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఆకులపై యూరియా, పొటాషియం నైట్రేట్ నేరుగా పిచికారిచేస్తే తొందరగా వాటిని ఆకులు ఆహార పదార్థాలుగా మార్చుతాయి. అలా తయారైన ఆహారాన్ని పొటాషియం నైట్రేట్లో ఉన్న పొటాషియం పూమొగ్గలకు తొందరగా చేరవేసి పూతగా రావటానికి ఉపయోగపడుతుంది..

తేనే మంచు పురుగు..రసాన్ని పీల్చడం వల్ల పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. లేత ఆకులు, కొమ్మలనుంచి కూడా రసం పీల్చడంతో ఆకులు ముడు తపడి సరిగా పెరగవు. పురుగులు విసర్జించిన తేనెలాంటి బంక ఆకుల మీద కారి, సూర్యరశ్మి వెలుతురులో మెరుస్తూ ఉంటుంది..

నివారణ:

ఫాస్ఫామిడాన్ 0.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 15 మి. లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ చొప్పున లీటర్ నీటిలో కలిపి పిందెలు తయారయ్యే సమ యాల్లో పూకులపైనే కాకుండా మొదళ్ళపైన, కొమ్మలపైన కూడా పిచి కారి చేయాలి. పూత పూర్తిగా విచ్చుకోక ముందే పిచికారి చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారి వేయడం వల్ల పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపిస్తే కార్బరిల్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా కార్బెండాజిమ్ 1గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. థయోమిథాక్సామ్ (0.3గ్రా/లీ. నీటికి) పిచికారి చేస్తే పూత, కాపు సమయంలో తేనెమంచు పురుగును నివారించవచ్చు..

 

Read more RELATED
Recommended to you

Latest news