అద్భుతం.. బాల్క‌నీలో యాపిల్ పండ్ల‌ను పండిస్తున్నాడు..!

-

యాపిల్ పండ్లు అంటే స‌హ‌జంగానే ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఎక్కువ‌గా పండుతాయి. అలాంటి వాతావ‌ర‌ణంలోనే యాపిల్ చెట్లు పెరుగుతాయి. ఉష్ణ మండ‌ల ప్ర‌దేశాల్లో యాపిల్ చెట్ల‌ను పెండ‌చం క‌ష్ట‌మే. కానీ అలాంటి అసాధ్య‌మైన పనిని కూడా అత‌ను సుసాధ్యం చేశాడు. త‌న ఇంటి బాల్కనీలో యాపిల్ చెట్ల‌ను పెంచుతూ యాపిల్ పండ్ల‌ను పండిస్తున్నాడు.

బెంగ‌ళూరులోని కొత్త‌నూర్ అనే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో వివేక్ అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. అత‌నికి మున్నార్‌లో ఫామ్ ఉంది. అయితే బెంగ‌ళూరులోని త‌న అపార్ట్‌మెంట్ బాల్క‌నీలో యాపిల్ చెట్ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించాడు. అందుకు గాను 2018లో బొన్సాయ్ ర‌కానికి చెందిన ఓ యాపిల్ మొక్క‌ను కాలిఫోర్నియా నుంచి తెచ్చి నాటాడు.

ఓ కుండీలో ఆ యాపిల్ మొక్కను నాటి ఆ కుండీకి చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు చేశాడు. దీంతో ఆ రంధ్రాల ద్వారా మొక్క వేళ్ల‌కు గాలి బాగా త‌గులుతుంది. మొక్క బాగా పెరుగుతుంది. ఇక బొన్సాయ్ ర‌కం కాబ‌ట్టి 3 ఏళ్ల‌లోనే మొక్క పెరిగి చెట్టుగా మారింది. పువ్వులు పూసి కాయ‌లు కాయ‌డం మొద‌లు పెట్టింది.

అలా వివేక్ త‌న అపార్ట్‌మెంట్ బాల్క‌నీలోనే యాపిల్ చెట్టును పెంచాడు. దానికిప్పుడు పండ్లు పండుతున్నాయి. వాటిని ఫొటో తీసి వివేక్ షేర్ చేశ‌డు. బాల్క‌నీలో అంత అద్భుతంగా యాపిల్ చెట్టును పెంచుతున్నందుకు అందరూ అత‌న్ని అభినందిస్తున్నారు. అయితే ఇదే కాదు.. వివేక్ ఇప్ప‌టికే 300 ర‌కాల‌కు పైగా పండ్ల‌ను ఇలా పెంచాడు. త్వ‌ర‌లోనే మున్నార్‌లో ఉన్న త‌న ఫామ్‌లో స‌ద‌రు యాపిల్ చెట్ల‌ను పెంచుతాన‌ని చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version