ఈ వారమే లైగర్​, ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే?

-

బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలతో జోరు మీదున్న టాలీవుడ్​.. ఈ వారం థియేటర్‌లో మరిన్ని చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ వారం థియేటర్‌, ఓటీటీలో వచ్చే చిత్రాలేంటో చూద్దామా?

తెలుగుతో పాటు, దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న మూవీ ‘లైగర్‌. పూరి జగన్నాథ్‌దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనన్య పాండేకథానాయిక. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తల్లీకొడుకుల అనుబంధాన్ని తెలియజేస్తూ పూరి శైలిలో మాస్‌గా ఈ కథ సాగుతుంది. కరీంనగర్‌ నుంచి తల్లితో కలిసి ముంబయి వెళ్లిన ఓ కుర్రాడు టీఅమ్ముకొంటూ, రిక్షా లాగుతూ ఎంఎంఏ ఛాంపియన్‌గా ఎలా నిలిచాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విజయ్‌లో ఇందులో ఎంఎంఏ ఫైటర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం థాయిలాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. పూరి-విజయ్‌ కాంబినేషన్‌లో అదీ మాస్‌సినిమా కావడంతో ‘లైగర్‌’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌తో పాటు, రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్ర పోషించారు.

లైగర్
లైగర్

అయితే ఈ వారం థియేటర్‌లో ‘లైగర్‌’ మినహా మరే భారీ చిత్రమూ విడుదల కావటం లేదు. దీంతో పాటు, ఆగస్టు 26న ‘పీకే’, ‘భళా చోర భళా’, ‘కళాపురం’ వంటి చిన్న చిత్రాలు విడుదలకానున్నాయి.

'పీకే'
‘పీకే’
భళా చోర భళా
భళా చోర భళా
కళాపురం
కళాపురం

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

అమెజాన్‌ప్రైమ్‌వీడియోలో ప్లీజ్‌ ఫైండ్‌ అటాచ్‌డ్‌ (హిందీ సిరీస్‌ 3) ఆగస్టు 24, సమారిటన్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 26 రానుంది.

ప్లీజ్‌ ఫైండ్‌ అటాచ్‌డ్‌
ప్లీజ్‌ ఫైండ్‌ అటాచ్‌డ్‌

నెట్‌ఫ్లిక్స్‌లో ది వాకింగ్‌ రెడ్‌ (వెబ్‌సిరీస్‌-11) ఆగస్టు 22, లాస్ట్‌ ఓల్లీ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24,దట్స్‌ అమోర్‌ (ఒరిజినల్‌ మూవీ ) ఆగస్టు 25, ఢిల్లీ క్రైమ్‌ (హిందీ సిరీస్‌2) ఆగస్టు 26, సియోల్‌ వైట్‌ (కొరియన్‌ మూవీ) ఆగస్టు 26, మీ టైమ్‌ (ఒరిజినల్‌ మూవీ) ఆగస్టు 26, పార్ట్నర్‌ ట్రాక్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 26 స్ట్రీమింగ్​ కానున్నాయి.

డిస్నీ+హాట్‌స్టార్‌లో హౌజ్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 22, ఫియర్‌ లెస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24, రిపీట్‌ (తెలుగు) ఆగస్టు 25, క్రిమినల్‌ జస్టిస్‌ (హిందీ సిరీస్‌-3) ఆగస్టు 26, సోనీలివ్‌లో మహారాణి (హిందీ సిరీస్‌) ఆగస్టు 25 విడుదల కానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news