తమిళ దర్శకుడు లింగుస్వామికి చేదు అనుభవం ఎదురైంది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఓ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇదీ జరిగింది.. హీరో కార్తి, హీరోయిన్ సమంతతో యెన్ని ఏలు నాల్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసింది తిరుపతి బ్రదర్శ్ ప్రొడక్షన్స్. దీనికి దర్శకుడు లింగుస్వామి. అయితే ఈయన సినిమా అవసరాలకు పీవీపీ ఫైనాన్స్ కంపెనీ నుంచి కోటి 35 లక్షలు అప్పుగా తీసుకుని నిర్మాతలకు ఇచ్చారు.
ఆ తర్వాత రూ. 35లక్షలను పీవీపీ ఫైనాన్స్‌కు చెక్ ద్వారా ఇచ్చారు. కానీ అది బౌన్స్ అయింది. దీంతో సదరు కంపెనీ.. ఆయనపై కోర్టులో కేసు వేసింది. దీనిని విచారించిన చెన్నైలోని సైదాబాద్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ.. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. లింగుస్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది.
కాగా, లింగుస్వామి తెరకెక్కించిన టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని ది వారియర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిశెట్టి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జులై 14న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ చిత్రంలో విలన్ ఆది పినిశెట్టి- హీరో రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రామ్.. సత్య అనే పోలీసు పాత్ర పోషించారు. విధుల్లో చేరగానే ఆ ఊరి గ్యాంగ్‌స్టర్ గురు (ఆది పినిశెట్టి)పై దృష్టి పెడతాడు. గురుపై విజయం సాధించేందుకు సత్య ఎలాంటి ఆపరేషన్ చేపట్టాడు? ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన సవాళ్లేంటి? విజిల్ మహాలక్ష్మి (కృతిశెట్టి)గా ఫేమస్ అయిన అమ్మాయితో సత్యకి ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు ఈ కథలో ఆసక్తికరం.