ఎంపీ రఘురామపై చర్యలు తీసుకోవద్దు : సుప్రీం ఆదేశం

-

ఏపీలోని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఎఫ్‌ఐఆర్‌పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జె.కె.మహేశ్వరితో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వుల వరకు స్టే విధించింది.

అసలేం జరిగిందంటే.. ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడిపై(జులై 5) మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్‌, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేశ్ వెల్లడించారు. మరో పక్క కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు రఘురామ ఇంటివద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ… ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్‌ ఫరూక్‌ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించగా… ఫరూక్‌ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసు విభాగం పేర్కొనడం గమనార్హం

Read more RELATED
Recommended to you

Latest news