ఆ ముగ్గురు అదృష్ట‌వంతులు.. రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేస్తున్న‌రు!

-

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అంతుచిక్కదు. ఒక సమయంలో అనామకులుగా ఉన్న వారు తక్కవ కాలంలోనే అందరినీ శాసించే స్థాయికి చేరకుంటారు. అందుకే అంటారు ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతాయని. రాష్ర్ట రాజకీయాల గురించి తెలిసిన వారికి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేర్వేరు పార్టీకు చెందిన వీరిలో ఓ సారూప్యత ఉంది. అదేంటంటే… ముగ్గరూ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి… తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో గెలిచి చక్రం తిప్పుతున్నారు.

కిషన్ రెడ్డి /రేవంత్ రెడ్డి/బండి సంజయ్
కిషన్ రెడ్డి /రేవంత్ రెడ్డి/బండి సంజయ్

కిషన్ రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తన సొంత అసెంబ్లీ అయిన అంబర్ పేట నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసినా కూడా టీఆర్ఎస్ అభ్యర్థి చేతితో పరాజయం పాలయ్యాడు. కానీ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి తన సత్తా నిరూపించుకున్నాడు. ఎంపీగా గెలవడమే కాకుండా అనతి కాలంలోనే కేంద్ర క్యాబినేట్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రాష్ర్ట బీజేపీని శాసించే స్థాయిలో ఉన్నాడు. అసలు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయన అనుచరులు కూడా ఈ విధంగా జరుగుతుందని ఊహించి ఉండరు కావచ్చు. కానీ టైం అంటే అదేనని పలువురు చెబుతున్నారు.

కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ది కూడా సేమ్ స్టోరీనే. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి సిట్టింగ్ గా ఉన్న ఆయన 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశాడు. కానీ దానితో అధైర్యపడకుండా తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. ఇక బీజేపీ చీఫ్ సంజయ్ కూడా సేమ్ పరిస్థితిని ఎదుర్కున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన ఎంపీగా గెలిచి సత్తా చాటారు.

Read more RELATED
Recommended to you

Latest news