శంకర్ ‘జీన్స్’ చిత్రాన్ని తిరస్కరించిన హీరోలు వీళ్లే..!

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని నటీ నటులు అనుకుంటుంటారు. ఆయన తెరకెక్కించే గ్రాండియర్, లార్జర్ దెన్ లైఫ్ మూవీ చూసి ఆడియన్స్ వావ్ అని ప్రశంసిస్తుంటారు. అటువంటి గొప్ప దర్శకుడి మార్గదర్శకంలో పని చేయాలని ప్రతీ ఒక్క నటుడు, నటీమణి అనుకుంటారు. కాగా, ఆయన సినిమా అని తెలిసి కూడా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారట. వారెవరు? ఆ సినిమా ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ పిక్చర్ తీసిన తర్వాత శంకర్ చేసిన మరో బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జీన్స్’. ఈ సినిమా స్టోరి విషయం లో డిస్కషన్ జరిగినపుడు సింపుల్ స్క్రీన్ ప్లే తో ఈ సారి మూవీ చేయాలని శంకర్ తన టీమ్ కు చెప్పారట. అలా ఈ సినిమా స్టోరి రెడీ అయిన తర్వాత.. టైటిల్ ‘జీన్స్’ అని అప్పుడే ఫిక్స్ అయ్యారట.

ఇక ఆ తర్వాత కాస్టింగ్ విషయమై ఆలోచనలు స్టార్ట్ చేశారు. తొలుత అబ్బాస్ ను సంప్రదించారు. అయితే, అప్పటికే ‘ప్రేమదేశం’ మూవీతో ఫుల్ బిజీ అయిపోయిన అబ్బాస్ తన వద్ద మూడేళ్ల వరకు డేట్స్ లేవని చెప్పేశాడట.

అలా ఆ పిక్చర్ ను ఆయన రిజెక్ట్ చేయగా, నెక్స్ట్ కోలీవుడ్ మరో స్టార్ హీరో అజిత్ కుమార్ వద్దకు ఈ స్టోరి వెళ్లింది. అజిత్ కూడా తన వద్ద డేట్స్ లేవని చెప్పేశాడట. అలా ఆయన కూడా ఈ సినిమా రిజెక్ట్ చేసినట్లయింది.

ఇక ఆ తర్వాత ఈ సినిమా ప్రశాంత్ వద్దకు వెళ్లగా, ఆయన ఓకే చేసేశాడు. అయితే, ‘ప్రేమికుడు’ సినిమాను శంకర్ ప్రశాంత్ తో చేయాలనుకున్నాడట. కానీ, అప్పుడు ప్రశాంత్ నో చెప్పాడట. అలా ఇప్పుడు ‘జీన్స్’ చేయడానికి ప్రశాంత్ వెంటనే ఓకే చెప్పేశాడు. అలా ఈ సినిమాకు హీరో ఓకే కాగా, హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ను ఫిక్స్ చేశారు డైరెక్టర్ శంకర్. ఇక ఈ చిత్రం మ్యూజికల్ గా ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఆడియన్స్ కు ఫేవరెట్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news