ఆమె నెల్లూరు సినతల్లి : చంద్రబాబు

-

ఏపీలో నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి మృతి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే నారాయణ చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎస్సై కరీముల్లా కొట్టడంతోనే తన భర్త మరణించాడంటూ నారాయణ భార్య పద్మ ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై ఎస్సీ కమిషన్ విచారణ కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఉదయగిరి నారాయణ మృతి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భర్త ఉదయగిరి నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం చూస్తుంటే ‘జై భీమ్’ చిత్రంలోని సినతల్లిని తలపిస్తోందని తెలిపారు చంద్రబాబు. ఆమె నెల్లూరు సినతల్లి అని పేర్కొన్నారు చంద్రబాబు. బెదిరింపులకు బెదరక, ప్రలోభాలకు లొంగక భర్త మరణంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న నెల్లూరు దళిత మహిళను అభినందిస్తున్నానని వివరించారు చంద్రబాబు.

Former CM Chandrababu Naidu test positive for Covid-19- The New Indian  Express

పొదలకూరు ఎస్సై కరీముల్లా కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలని వ్యవస్థలకు, ప్రభుత్వానికి ఎదురు నిలిచి దళిత మహిళ చేస్తున్న పోరాట అసామాన్యం అని అభివర్ణించారు చంద్రబాబు. దళితవర్గ పోరాటంతో, జాతీయ ఎస్సీ కమిషన్ విచారణతో ప్రభుత్వం కదలక తప్పలేదని, పద్మ కుటుంబానికి పరిహారంతో సరిపెట్టకుండా, ఆమె భర్త మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పద్మపోరాటంలో అడుగడుగునా అండగా నిలిచారంటూ దళిత సంఘాలకు, రాజకీయ పార్టీల నేతలకు అభినందనలు తెలిపారు చంద్రబాబు. దళితుడి హత్య కేసును నీరుగార్చేందుకు చేస్తున్న సిగ్గుమాలిన ప్రయత్నాన్ని ఇకనైనా కట్టిపెట్టాలని హితవు పలికారు చంద్రబాబు. ముగ్గురు బిడ్డలు అనాథలైన ఘటనలో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news