గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన రోజే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం గమనార్హం. అయితే గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ కి బెదిరింపులకు కూడా పాల్పడినట్టు సమాచారం. ఈ సినిమా ప్రైవేటు బస్సుల్లో ప్రదర్శన చేశారు. ఈ విషయం చిత్ర నిర్మాతకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి గేమ్ ఛేంజర్ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ సినిమా పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్టు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.