తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏను వచ్చే నెల జీతంతో కలిపి చెల్లించనున్నట్లు వేర్వేరుగా జారీ చేసిన రెండు జీవీల్లో పేర్కొంది సర్కార్. పెరిగిన డీఏలు ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా వర్తింపచనున్నాయి. ఇటీవల సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి… ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను చెల్లించడానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
మొత్తంగా 3 డీఏలు కలిపి.. 10.01 శాతాన్ని వచ్చే నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు. జనవరి 2020 చెల్లించాల్సిన డీఏ 3.64 శాతం, జూలైలో 2.73 శాతం, 2021 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ లో జమ చేస్తారు. 2022 జనవరి నుంచి మూడు డీఏలను ఫిబ్రవరిలో అందుకునే వేతనంతో కలిపి చెల్లించనున్నారు. పెన్షనర్లకు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరు విడుతల్లో బకాయిలను అందించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ చెల్లింపుకు జాప్యం జరిగిన సంగతి తెలిసిందే.