బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ ముఖ్యమైన అలర్ట్..!

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ని అలర్ట్ చేసింది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని హెచ్చరించింది బ్యాంక్. ఈ మధ్య కాలం లో మోసాలు ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. కేవైసీ మోసాలు అయితే బాగా ఎక్కువవుతున్నాయని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ఆర్‌బీఐ అంది. వివిధ రకాలుగా బ్యాంక్ కస్టమర్లను మోసగిస్తున్నారని బ్యాంక్ అంది. కనుక మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

సోషల్ మీడియా ద్వారా స్కామ్స్ జరుపుతున్నారు. కనుక అలాంటి వాటి నుండి దూరంగా ఉండాలి. అదే విధంగా తెలియని వాళ్ళు ఫోన్ కాల్ చేసినా లేదంటే ఈమెయిల్ వంటివి పంపితే స్పందించద్దు. అదే విధంగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని కోరితే జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. లేదు అంటే మోసపోవాల్సి ఉంటుంది. బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ, ఇవాలెట్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి సేవలు పొందాలని అంది రిజర్వ్ బ్యాంక్. లేదు అంటే డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్లి సేవలని పొందాలని చెప్పింది. విషింగ్, ఫిషింగ్, రిమోట్ యాక్సెస్ వంటి వాటి వలన చాలా మంది మోసపోయారని చెప్పింది.

కనుక ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి బ్యాంక్ లో అకౌంట్ వున్నవాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే మోసగాళ్లు కాల్ చేసి కేవైసీ అప్‌డేట్,సిమ్ కార్డు అన్‌బ్లాకింగ్, అకౌంట్ యాక్టివేషన్ లాంటివి చెయ్యాలి చెబితే నమ్మొద్దు. అలానే తెలియని లింక్స్ కి దూరంగా వుండండి. అనవసరంగా వాటి పై క్లిక్ చెయ్యకండి. అలానే మోసగాళ్లు కాల్ చేసి సమస్య పరిష్కారం అవ్వాలంటే యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోమని అంటున్నారు. ఇలా కనుక మీరు చేసారు అంటే మీ అకౌంట్ ఖాళీ అయ్యిపోతుంది. కనుక వీటితో జాగ్రత్తగా వుండండి. లేదంటే ఇబ్బందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news