10 రూపాయలకు సింగిల్ టీ కూడా రాదు..అలాంటిది మూడు ఇడ్లీలు,ఒక వడ ఇస్తున్నారు.మీరు విన్నది నిజమే..ఎక్కడో కాదు కర్ణాటకలో..హుబ్లీకి చెందిన నాగరాజా బద్ది అనే యువకుడు హాఫ్ కప్పు టీ కూడా లేని ధరతో కడుపునిండా భోజనం అందిస్తున్నాడు. అతను గత 12 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగిస్తున్నాడు. విశేషమేమిటంటే ఇప్పుడు కూడా అప్పటి ధరకే ఇడ్లీ-వడను అందిస్తున్నాడు. అయితే, అతని హోటల్ రోజంతా తెరిచి ఉండదు. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమై 10.30 గంటలకు ముగుస్తుంది.
కేవలం 3 గంటలు మాత్రమే ఇక్కడ ఆహారం అందుబాటులో ఉంటుంది.ఇక్కడ, వందలాది మంది ప్రజలు క్యూలో నిలబడి తమ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు.10కి మూడు వడలు ఇస్తారు. దీనితో పాటు రుచికరమైన సాంబార్, చట్నీ కూడా ఉంటుంది. డబ్బు లేకుండానే పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేస్తూ అనేక సందర్భాల్లో ఔదార్యాన్ని ప్రదర్శించాడు.అతను లాభాలకు కోసం ఈ హోటల్ ను పెట్టలేదు.. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలను మరెవ్వరూ పడకూడదని ఇలా చేస్తున్నాడు..పది మంది కడుపు నింపడం సంతోషంగా ఉందని తెలిపాడు.
12 ఏళ్ల నుంచి ధర పెరగలేదు. ఇంకా పెంచే ఉద్దేశం లేదు. ప్రజల ఆశీస్సులతో తృప్తి పొందుతున్నాను. నేను లాభం కంటే కస్టమర్ సంతృప్తితో ఎక్కువ తృప్తి పొందుతున్నానని చెబుతున్నాడు నాగరాజు. ఇక్కడి హోటల్లో ప్రజలకు ఇష్టమైన ఇడ్లీ, వడతో పాటు తమ ప్రేమను కూడా పంచుతారంటూ కస్టమర్లు నాగరాజును ప్రశంసిస్తున్నారు. మన కళ్ల ముందే డబ్బులు లేకుండా వచ్చిన ఎందరో శరణార్థులకు ఉచితంగా ఇడ్లీ వడ అందించారని. రోజూ ఆయన దగ్గరకు వచ్చి టిఫిన్ చేస్తామంటూ ఇక్కడి వచ్చే తింటున్నారు.నిజంగా ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు..