ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర ఫైరింగ్ జరిగింది. జగర్గుండా పోలీసు స్టేషన్ పరిధిలోని కుందేడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అమరులైన జవాన్లను ఏఎస్ఐ రామ్నాగ్, కానిస్టేబుల్ కుంజమ్ జోగా, వంజం భీమాగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎదురుకాల్పులు జరిగిన సమీప ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.
కూంబింగ్ జరుగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా భద్రతా బలగాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సడెన్గా ఫైరింగ్ స్టార్ట్ చేసిన మావోయిస్టులపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు దుర్మరణం చెందారు.