Thurum Khanulu : “తురుమ్ ఖానులు” టీజర్ కు ముహూర్తం ఖరారు

-

శ్రీరామ్ నిమ్మల హీరోగా నటిస్తున్న తాజా సినిమా తురుమ్ ఖానులు. “ఉత్తర” సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీరాం నిమ్మల..  ఈ హ్యూమర్ జానర్ లో హీరోగా నటిస్తున్నారు. డార్క్ హ్యూమర్ జానర్ లో వస్తోన్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది దర్శకుడు తెలిపారు. “తురుమ్ ఖాన్లు” రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు. సినిమాను ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 9వ తేదీన అంటే… ఎల్లుండి ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేసింది చిత్ర బంధం. ఇందులో హీరోతో పాటు ఇతర నటీనటులు… సందడి చేశారు.

కాగా ఈ సినిమా కేకే సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా…. శివన్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కె కళ్యాణ్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా అంబటి రాంబాబు వ్యవహరిస్తుండగా.. ఎడిటర్ గా నాగేశ్వరరావు బొంతల, మ్యూజిక్ డైరెక్టర్ గా కె ఎస్ గణన్ పని చేస్తున్నారు.

https://www.facebook.com/watch/?v=2582857948525960&extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing

Read more RELATED
Recommended to you

Latest news