కుప్పం పర్యటనలో వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ జనసేన తో పొత్తులపై చంద్రబాబు ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి సెటైర్లు పేల్చారు. రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని… వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడని చంద్రబాబుకు చురకలు అంటించారు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ… నిన్ను లవ్ చేసేది పచ్చ కుల మీడియా, నీ బినామీలేనని సెటైర్లు పేల్చారు.
“చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఇంత నీచానికి దిగాలా Tv5 నాయుడూ? ఫైవ్, ఫైవ్ అంటూ రోడ్డు పక్కన ఇంకేదైనా చీకటి వ్యాపారం చేస్తే గిట్టుబాటు అవుతుందేమో చూడు. జర్నలిజం ముసుగులో టీవీ ఛానెల్ తో నీవు చేయగలిగింది ఏమీ లేదు. జనాల ఉమ్మిలో కొట్టుకుపోతున్న నీ ‘యజమాని’ని ఒడ్డుకు లాగలేవు.” అంటూ మరో ట్వీట్ లో విజయసాయి రెడ్డి రెచ్చిపోయారు. మనిషి జన్మ ఎత్తి, సిగ్గూ ఎగ్గూ వదిలేసి బురదలో దొర్లే జంతువులతో కలిసిపోయేవేంటి టివీ-5 నాయుడూ? దేనికైనా కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయని… అన్నిటినీ దాటి ఊబిలోకి జారిపోయావు. బోరు బావిలో పడ్డ పిల్లల్ని తీయొచ్చుకానీ నువ్వు మాత్రం బయటకు రాలేవు. అంతగా పతనమయ్యావు అని ఫైర్ అయ్యారు.