ఏంటో టీఆర్ఎస్‌లో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు రాజకీయం ఈ మధ్య క్లారిటీ ఉండటం లేదు…కాసేపు ఈయన టీఆర్ఎస్‌కు మద్ధతుగా మాట్లాడినట్లే ఉంటారు..ఒకోసారి ఏమో టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నట్లు మాట్లాడతారు. అసలు ఈయన వైఖరి ఏంటో అర్ధం కాకుండా ఉంటుంది. అలాగే ఈయన సీటు విషయంలో కూడా క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కుతుందా? లేదా? అనే డౌట్ తుమ్మల అనుచరుల్లో ఎక్కువ వస్తుంది.
ఇదే సమయంలో తుమ్మల తన తనయుడుని ఎన్నికల బరిలో దించడానికి చూస్తున్నారనే ప్రచారం వస్తుంది. అసలు ఎవరు బరిలో దిగుతారో తర్వాత…ముందు తుమ్మలకు సీటు వస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు. అసలు తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరావు చాలా సీనియర్ నేత…చాలా ఏళ్ళు ఈయన టీడీపీలో పనిచేసి…ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు.
అయితే రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది…దీంతో ఆయన టీడీపీని వదిలి…టీఆర్ఎస్‌లోకి వచ్చారు. అలాగే 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచారు..కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కానీ 2018 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. తుమ్మలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. దీంతో తుమ్మల మంత్రి ఆశలు అడియాసలయ్యాయి. పైగా ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్‌ని వదిలి..టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఆయనే పాలేరులో కీలకంగా ఉన్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు టీఆర్ఎస్ టిక్కెట్ ఉపేందర్‌దే అని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీంతో తుమ్మల అనుచరులు అయోమయంలో పడ్డారు. ఎలాగో ఏ పదవి రాలేదు…కనీసం నెక్స్ట్ టిక్కెట్ అయిన దక్కుతుందా? లేదా? అనేది డౌట్. పైగా పాలేరు ప్రజలని తుమ్మల దగ్గరకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారట. అంటే ఎమ్మెల్యే ఉపేందర్ ఇదంతా చేస్తున్నారని తుమ్మల అనుచరులు ఫైర్ అవుతున్నారు.
అయితే తుమ్మల కూడా డైరక్ట్‌గా కామెంట్ చేస్తున్నారు..అలాగే పార్టీ నిర్ణయంతో మళ్ళీ ప్రజల ముందుకొస్తానని అంటున్నారు. అసలు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాకుండా ఉంది…నెక్స్ట్ పాలేరు టిక్కెట్ తుమ్మలకు ఇస్తారా? లేక ఉపేందర్‌కు ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. మరి తుమ్మల భవిష్యత్ ఏం అవుతుందో చూడాలి.