ప్రకాశం జిల్లాలో పెద్దపులి క‌ల‌క‌లం

-

ప్రకాశం జిల్లాలో పెద్దపులి కలకలం రేగింది. జిల్లాలోని అర్ధవీడు మండలంలో పులి సంచరిస్తుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో జ‌నావాసంలోకి పులులు సంచారం చేస్తున్నాయి. మాగుటూరు, నాగులవరం, గొట్టిపడియ లక్ష్మీపురం ప్రాంతాల్లో పులి సంచరించినట్టు గుర్తించారు. పులి సంచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులి పాదముద్రలను సేకరించారు.

12 Men Arrested For Cooking And Eating A Tiger At Andhra Pradesh

పెద్దపులి నీరు తాగేందుకు నాగులవరం సమీపంలోని కంభం చెరువు వద్దకు వచ్చిందని అధికారులు నిర్ధారించారు. పులి సంచారం నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పులిని బంధించి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అర్ధవీడు మండలంలో గత జనవరిలోనూ పులి బెంబేలెత్తించింది. కాకర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఓ ఆవును చంపి తినేసింది. మరో ఆవుపై దాడి చేస్తుండగా రైతులు కేకలు వేయడంతో పారిపోయింది. ఇప్పుడు పులి సంచ‌రిస్తుంద‌న్న స‌మాచారంతో ప్రజ‌లు బెంబేలెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news