ఊహించని రీతిలో ఏపీ నాయకులు BRSలో చేరబోతున్నారు – పైలెట్ రోహిత్ రెడ్డి

-

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ తీరుపై స్పందించారు. ఊహించని రీతిలో ఏపీ నాయకులు BRSలో చేరబోతున్నారని వెల్లడించారు పైలెట్ రోహిత్ రెడ్డి.

సరైన నాయకత్వం లేకపోవడంతోనే దేశం,ఏపి అభివృద్ది చెందలేదని వివరించారు పైలట్ రోహిత్ రెడ్డి. బిఆర్ఎస్ కి ఏపి నుంచి అన్యూహ స్పందన లభిస్తూందని చెప్పారు. ఎవరు ఉహించని విధంగా ఏపి నుంచి నాయకులు బిఆర్ఎస్ లో చేరుబోతున్నారని.. స్పష్టం చేశారు. విభజన తరువాతే కేసిఆర్ నాయకత్వం కారణంగా తెలంగాణ అభివృద్ది చెందిందని వెల్లడించారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news