తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ నృసింహుడిగా మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. యోగ శాస్త్రంలో వాహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి సింహం ఆదర్శం. విష్ణు సహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహః స్తోత్రం ఉంటుంది. సింహ బలమంత భక్తిబలం కలిగి ఉన్నవారికి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.
రెండేళ్ల తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరగుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.