తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు ప్రస్తుతం వేచి ఉన్నారు. దీంతో పది నుంచి 12 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతుంది. ఇక నిన్న 80, 130 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

అలాగే 26,786 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి గుండె ఆదాయం 4.55 కోట్లుగా నమోదు అయింది. అటు అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లు ఇవాళ టిటిడి పాలకమండలి రిలీజ్ చేయబోతోంది. ఇక అటు అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు రిలీజ్ చేసింది. ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదులకోటాను విడుదల చేయనున్నారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ప్రత్యేక దర్శనం, టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తగా రావాలని అధికారులు స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తులు ఏమాత్రం ఆగకుండా అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు.