జగన్ మెజార్టీ టార్గెట్..ఆ మంత్రి పెత్తనం పై వైసీపీ నేతల ఆసక్తికర చర్చ

-

తిరుప‌తి పార్లమెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో గెలుపు పై గట్టి నమ్మకంతో ఉంది వైసీపీ. అయితే గెలుపు కంటే ఇక్కడ మెజార్టీ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు వైసీపీ నేతలు. మెజార్టీ పై సీఎం జగనే దిశానిర్ధేశం చేయడంతో పాటు మంత్రులకు భాద్యతలు అప్పగించారు. పేరుకు ఏడుగురు మంత్రులకు ఏడు నియోజకవర్గాలు కేటాయించినా పూర్తి బాధ్యత మాత్రం ఒక్క మంత్రికే కట్టబెట్టారు. ఇప్పుడు దీనిపైనే వైసీపీ నేతల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

2019లో జరిగిన తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ 2 లక్షల 28 వేల మెజార్టీ సాధించారు. మొత్తంగా ఏడు లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు మెజార్టీ టార్గెట్ 5 లక్షలుగా వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అంతకుమించిన ఆధిక్యత ఎలా వస్తుందని వైసీపీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారట. ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా మంత్రుల‌ను కేటాయించారు. అదేవిధంగా స‌ల‌హాదారుల‌ను కూడా కేటాయించారు. అయితే ఈ మొత్తం వ్యవ‌హారానికి ఇంచార్జ్‌గా చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యత అప్పగించారు. ఇదే ఇప్పుడు వైసీపీలో చ‌ర్చనీయాంశంగా మారింది.

ఏడుగురు మంత్రులకు ఎమ్మెల్యేలకు మెజార్టీ టార్గెట్లు పెట్టినా పూర్తి భాద్యత మంత్రి పెద్దిరెడ్డికి కట్టబెట్టడంతో నేత‌ల‌ను స‌మ‌న్వయం చేసుకోవ‌డంతోపాటు.. కార్యక‌ర్తల‌కు దిశానిర్దేశం చేయ‌డం ఆయనే చేస్తున్నారు. రేపు అంతే భారీ మెజార్టీతో గెలిచిన ఆ గెలుపు క్రెడిట్ అందరికి వస్తుందా కేవలం మంత్రి పెద్దిరెడ్డికే దక్కుతుందా అన్న చర్చ వైసీపీ ప్రజాప్రతినిధుల్లో నడుస్తుందట. ఈ ప‌రిణామం పార్టీలో ఐక్యత‌ను దెబ్బతీసే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news