షాకింగ్‌ : తిరుమలలో బయటపడ్డ టికెట్ల కుంభకోణం..

ఏడుకొండలు శ్రీవేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రమైన తిరుమలలో టిక్కెట్ల కుంభకోణం బయటపడింది. తిరుమల ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫారసు లేఖలను వీఐపీ భక్తులకు విక్రయిస్తున్నారని శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి. గతంలో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ దగ్గర శ్రీహరి పనిచేసినట్లు తెలిపారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. నందిగామ ఎమ్మెల్యే సిఫారసు లేఖపై 6 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు రూ.18 వేలకు శ్రీహరి విక్రయించినట్లు పేర్కొన్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.

Tirupati temple's assets include over 10 tonnes of gold, cash worth  ₹15,938cr | Latest News India - Hindustan Times

శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో.. తిరుమలలో నకిలీ సేవా టిక్కెట్ల కుంభకోణం గుట్టురట్టు అయింది. నకిలీ సుప్రభాత సేవా టికెట్లతో దర్శనానికి వెళ్తున్న వారిని టీటీడీ అధికారులు పట్టుకున్నారు. 23 మంది భక్తుల దగ్గర నకిలీ సేవా టికెట్లను గుర్తించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. సేలం కేంద్రంగా నకిలీ టికెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలిపారు.