సీఎం హామీలు గాలి మాటలుగా మిగిలాయి : రేవంత్‌ రెడ్డి

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఎలు
పట్టుకొమ్మలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. వారితో గొడ్డు చాకిరి చేయించుకుంటోన్న ప్రభుత్వం వారి సాధకబాధకాలను గాలికి వదిలేసిందన్నారు రేవంత్ రెడ్డి. సీఎం హామీలు గాలి మాటలుగా మిగిలాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వీఆర్ఎ ల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. వీఆర్‌ఏలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ 83 రోజులు సమ్మె చేస్తున్నారని అన్నారు.

Revanth Reddy: Who fought in the movement.. dominance

కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రావడంతో వీఆర్ఏలను చర్చలకు ప్రభుత్వం పిలిచిందన్నారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నిక ఫలితాలు రాగానే అన్ని సమస్యలూ పరిష్కరించడంతో పాటు పే స్కేల్‌కు సంబంధించిన జీవో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని ఆరోపించారు.